: నా చెల్లెలు ఉగ్రవాదిగా మారి గన్స్ కాల్చే స్థాయికి చేరిందట: పోలీసులతో కొచ్చి యువకుడు


కేరళలోని కొచ్చి ప్రాంతం నుంచి గత నెలలో మాయమైన 22 ఏళ్ల మేరిన్ జాకబ్ అలియాస్ మరియమ్ ఇప్పుడు తుపాకులు కాల్చే స్థాయికి ఎదిగిందని ఆమె సోదరుడు ఎబిన్ పోలీసులకు వెల్లడించారు. తన భర్త బెస్టిన్ విన్సెంట్ అలియాస్ యహియాతో కలసి సిరియా పారిపోయిన ఆమె, ఇస్లాం మతం స్వీకరించి, ఇప్పుడు స్వల్ప శిక్షణతోనే గన్స్ కాల్చే స్థాయికి చేరిందని, ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించిందని ఎబిన్ వెల్లడించారు. సెప్టెంబర్ 2014లో కసరాగాద్ ప్రాంతానికి చెందిన అష్ఫాక్ మజీద్, ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ కు చెందిన ప్రవక్త ఆర్షిద్ ఖురేషీలను కలిసిన తరువాత ఆమె ప్రవర్తన మారిపోయిందని పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో తెలిపాడు. తనను సైతం మతం మార్చేందుకు వారు ప్రయత్నించారని, ఖురేషీని కలిపించేందుకు తనను ముంబై కూడా తీసుకువెళ్లారని తెలిపారు. ముస్లిం మతం మాత్రమే నిలుస్తుందని, ఇతరులంతా చనిపోక తప్పదని వారు తనకు చెప్పినట్టు వెల్లడించారు. అంధేరీలోని ఓ ప్రాంతంలో మతం మారిన నిమిష అలియాస్ ఫాతిమా కూడా తనను కలిసిందని చెప్పాడు. మతం మారేందుకు తాను ససేమిరా అంగీకరించలేదని తెలిపాడు. కాగా, గర్భవతిగా ఉన్న నిమిష తన భర్తతో కలసి సిరియా పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News