: వెల్‌లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ సభ్యులు.. రాజ్యసభ రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం కేవీపీ పెట్టిన బిల్లుపై చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టడంతో రాజ్యసభను డిప్యూటీ ఛైర్మన్ కురియన్ రేపటికి వాయిదా వేశారు. కేవీపీ బిల్లు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకున్న భారతీయ జనతా పార్టీ తీరుపై కాంగ్రెస్ నేతలు ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేయడంతో గందరగోళం కొనసాగింది. బిల్లుపై ఈ రోజే చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో కురియన్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది.