: ఏపీని కాంగ్రెస్ చంపేసి ఇప్పుడు సంతాపసభ పెట్టాలనుకుంటోంది: సీఎం రమేశ్
ఏపీని కాంగ్రెస్ చంపేసి ఇప్పుడు సంతాపసభ పెట్టాలనుకుంటోందని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సత్యాన్ని గ్రహించిందని, కాంగ్రెస్ సభ్యుల డిమాండ్ కు తాము మద్దతు తెలుపుతున్నామని అన్నారు. కాగా, ప్రైవేటు బిల్లుపై ఆగస్టు 5న చర్చ చేపడదామని డిప్యూటీ చైర్మన్ కురియన్ అన్నారు. ఏపీకు ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై గందరగోళం కొనసాగింది. బిల్లుపై ఈ రోజే చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టుబట్టడం, చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కురియన్ స్పందిస్తూ, నిబంధనల ప్రకారం చర్చ చేపట్టడానికి అభ్యంతరం లేదని, ప్రైవేటు బిల్లులను శుక్రవారం చర్చించడం జరుగుతుందని, ఒక శుక్రవారం కుదరకపోతే తర్వాత శుక్రవారం చర్చిద్దామని అన్నారు.