: మనాలీకి టూరిస్టుగా వచ్చిన ఇజ్రాయెల్ యువతికి ఎదురైన చేదు అనుభవం!
విహారయాత్ర నిమిత్తం భారత్ కు వచ్చిన ఓ ఇజ్రాయెల్ యువతి (25) హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో పర్యటిస్తున్న వేళ, సామూహిక అత్యాచారానికి గురైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నిన్న ఉదయం స్పిటీ వ్యాలీకి వెళ్లాలని భావించిన యువతి, ట్యాక్సీ కోసం ఎదురుచూస్తున్న వేళ, ఓ కారులో వచ్చిన ఇద్దరు యువకులు లిఫ్ట్ ఇస్తామని చెప్పారు. మనాలీ వరకూ తాము వెళుతున్నామని, అక్కడి నుంచి సులువుగా ట్యాక్సీలు లభిస్తాయని నమ్మబలకడంతో, ఆ యువతి కారెక్కింది. కారును దారిమళ్లించిన ఆ ఇద్దరు ఓ నిర్జన ప్రదేశంలో అఘాయిత్యం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి పంపారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.