: తక్షణమే హైకోర్టును విభజించాలి: జంతర్ మంతర్ వద్ద ధర్నాలో దిగ్విజయ్ సింగ్
హైకోర్టు విభజన చేయాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఈరోజు ధర్నాకు దిగింది. దీనిలో పాల్గొన్న న్యాయవాదులకు ఏఐసీసీ కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్షణమే హైకోర్టును విభజించాలని డిమాండ్ చేశారు. అలాగే, న్యాయాధికారుల విభజనలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని ఆయన అన్నారు. హైకోర్టు విభజన జరిగే వరకు న్యాయవాదులకు తాము అండగా ఉంటామని దిగ్విజయ్ సింగ్ అన్నారు.