: మీకు 4-0తో వైట్ వాషే... వెస్టిండీస్ కు కోహ్లీ వార్నింగ్!
నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను ఆడేందుకు వెస్టిండీస్ గడ్డపై కాలుమోపిన భారత జట్టు అన్నింటినీ గెలుచుకుంటుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నమ్మకంగా చెప్పాడు. తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్న తరువాత మీడియాతో మాట్లాడిన కోహ్లీ, వెస్టిండీస్ జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ సిరీస్ లో 4-0 తేడాతో ఆతిథ్య దేశానికి వైట్ వాష్ తప్పదని హెచ్చరించాడు. ఆసియా వెలుపల భారత్ సాధించిన అతిపెద్ద విజయం (ఇన్నింగ్స్ 92 పరుగుల తేడా) ఇదే కాగా, రెండో టెస్టులో భారత జట్టు విజయం సాధించి 2-0 లీడ్ సాధిస్తే, ఆపై ఏ మ్యాచ్ ని కూడా తాము డ్రా చేసుకునేందుకు ప్రయత్నించబోమని స్పష్టం చేశాడు. వైట్ వాష్ చేసేందుకు తమ జట్టుకు అన్ని అవకాశాలూ ఉన్నాయని అన్నాడు. ఒకసారి బ్యాటింగ్ చేసి, రెండు సార్లు ప్రత్యర్థులను ఆలౌట్ చేశామని, ఒక టెస్టు మ్యాచ్ లో ఇంతకన్నా మంచి ప్రతిభను ఎవరూ కనబరచలేరని తెలిపాడు.