: చిందేసిన తలసాని!... లష్కర్ బోనాల్లో తెలంగాణ మంత్రి సందడి!


సికింద్రాబాదులో లష్కర్ బోనాల సందడి కొనసాగుతోంది. నిన్న ప్రారంభమైన బోనాల్లో భాగంగా జనం భక్తిప్రపత్తులతో ఆయా ప్రాంతాల్లోని ఆలయాలకు జారతగా వెళుతున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాదులోని సీతాఫల్ మండిలో జరిగిన బోనాల్లో భాగంగా టీఆర్ఎస్ నేత, తెలంగాణ కేబినెట్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చిందేశారు. భారీ అనుచరగణంతో కదిలి వచ్చిన ఆయన డప్పు దరువులకు అనుగుణంగా చిందేసి ఆడారు. మంత్రి స్టెప్పులతో ఆయన అనుచరవర్గం కేరింతలు కొట్టింది. ఏటా జరిగే బోనాల్లో తలసాని లీనమై పాలుపంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఈ ఏటి బోనాల్లోనూ ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.

  • Loading...

More Telugu News