: ఇక విదేశీయుల కిడ్నాప్ లకు తెగబడండి: అల్ ఖైదా చీఫ్
"ఇస్లాంకు శత్రువులుగా ఉంటున్న వారు నడుపుతున్న జైళ్లలో మగ్గుతున్న ప్రతి ముస్లిం పురుష, మహిళా ఖైదీలంతా విడుదలయ్యేందుకు పశ్చిమ దేశాలకు చెందిన వారు ఎవరు కనిపించినా కిడ్నాప్ చేయండి. వారిని విడుదల చేయాలంటే మనవారిని విడిచిపెట్టాలని కోరుదాం" అంటూ అల్ ఖైదా చీఫ్ అయ్ మన్ అల్ జవహరీ ఓ ఆడియో ఇంటర్వ్యూలో పిలుపునిచ్చాడు. ప్రపంచంలో జీహాదీలు ఎక్కడున్నా తమకు దొరికే విదేశీయులను కిడ్నాప్ చేయాలని పిలుపునిచ్చాడు. ఆఫ్గన్, పాక్ సరిహద్దుల్లోని ఓ తాలిబాన్ కేంద్రంలో తలదాచుకుని అక్కడి నుంచే అల్ జవహరీ ఈ ఇంటర్వ్యూ ఇచ్చినట్టు తెలుస్తోంది.