: కేటీఆర్ కు జైట్లీ బర్త్ డే విషెస్!... వేదికపైనే తలపాగా చుట్టి భుజం తట్టిన వైనం!
టీఆర్ఎస్ యువనేత, తెలంగాణ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) బర్త్ డే నిన్న ఘనంగా జరిగింది. హైదరాబాదులో ఆయనపై విమానం నుంచి పూలు కురవగా, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ క్రమంలోనే నిన్న తెలంగాణలో పర్యటించిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ...కేటీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. పాలమూరు జిల్లా కొత్తూరు మండలం మామిడిపల్లిలో కొత్తగా ఏర్పాటైన సింబయాసిస్ యూనివర్సిటీ క్యాంపస్ ను జైట్లీ, కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపైనే కేటీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపిన జైట్లీ ఆయన తలపై ప్రత్యేకంగా తయారు చేసిన టోపీలాంటి ఓ తలపాగాను అలంకరించారు. తెలంగాణ మంత్రిగా కేటీఆర్ సత్తా చాటుతున్నారని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ ను జైట్లీ ఆకాశానికెత్తేశారు.