: సీఎం అవుతాననే నమ్మకం, కోరిక రెండూ లేవు: ఎంపీ డీఎస్


సీఎం అవుతాననే నమ్మకం, కోరిక తనకు మొదటి నుంచీ లేవని, అది తన లక్ష్యం కూడా కాదని టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ పార్టీలో ఉండగా జరిగిన పలు విషయాలను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కావాలనే మాట తన నోటి వెంట ఎప్పుడూ రాలేదని, ఎంపీ కావాలనే కోరిక మాత్రం తనకు ఉండేదని, అటువంటి అవకాశాన్ని కేసీఆర్ కల్పించారని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ సరైనదేనని, పదేళ్లలో కాంగ్రెస్ ఏం చేయలేకపోయిందని, కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పనితీరుపై కోదండరాం వాదనతో తాను ఏకీభవించనని అన్నారు.

  • Loading...

More Telugu News