: ఫిలింనగర్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తాం: మేయర్ బొంతు రామ్మోహన్
హైదరాబాద్ ఫిలింనగర్ లో నిర్మిస్తున్న రెండంతస్తుల భవనం కూలిపోయిన సంఘటన స్థలాన్ని మేయర్ బొంతు రామ్మోహన్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయమందిస్తామన్నారు. ఈ సంఘటనలో గాయపడ్డ వారిని అపోలో ఆసుపత్రికి తరలించామని, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించామని చెప్పారు. పది మంది కూలీలకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారన్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఆయన మాట్లాడుతూ, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని, ఈ నిర్మాణాలపై ఎటువంటి పర్యవేక్షణ లేదని, నాణ్యత లేని పనులతో కూలీల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన మండిపడ్డారు.ఈ సంఘటనపై పూర్తి విచారణ చేపడతామని, ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో అక్రమ నిర్మాణాలపై హౌస్ కమిటీకి నివేదిక ఇచ్చామని రామ్మోహన్ పేర్కొన్నారు.