: కృష్ణగిరి-హోసూరు మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం
తమిళనాడులోని కృష్ణగిరి-హోసూరు మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు ఆర్టీసీ బస్సు, కంటైనర్ ఢీకొన్న ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.