: కిడ్నాపర్ల చెరలో నరకం అనుభవించాను: ఇంజనీరు సాయి శ్రీనివాస్


నెల రోజుల క్రితం నైజీరియాలో కిడ్నాప్ నకు గురై వారి చెర నుంచి బయటపడ్డ విశాఖపట్టణం ఇంజనీరు సాయి శ్రీనివాస్ విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డబ్బు కోసమే కిడ్నాపర్లు తనను కిడ్నాప్ చేశారని, వారి చెరలో తాను నరకం చూశానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, దేవుడి దయ వల్ల తాను బతికి బయటపడ్డానని అన్నారు. కాగా, మూడేళ్లుగా నైజీరియాలో ఉంటున్న ఎన్. సాయిశ్రీనివాస్(44) అక్కడి గంగోటి సిమెంట్ కర్మాగారంలో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. గత నెలలో సాయి శ్రీనివాస్, అనీష్ శర్మలు కిడ్నాప్ నకు గురైన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News