: లక్ అంటే అతనిదే... దుబాయ్ లో రాత్రికి రాత్రే మిలియనీర్ అయిన పాకిస్థానీ!


పరాయి దేశంలో చాలీచాలని నెలసరి జీతంతో భారంగా బతుకును వెళ్లదీస్తున్న ఓ పాకిస్థానీ యువకుడు రాత్రికి రాత్రే మిలియనీర్ గా మారిపోయాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, పాక్ కు చెందిన అతిఫ్ నిజాం చౌదరి అనే వ్యక్తి, ఏడేళ్ల నుంచి దుబాయ్ లోని ఓ ప్రైవేటు సంస్థలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. అక్కడ మొబైల్ ఫోన్ సేవలందిస్తున్న డీయూ నుంచి ఓ ప్రీపెయిడ్ సిమ్ కొనడమే అతను చేసిన పని. ఆ సంస్థ తమ ప్రమోషన్ కోసం తీసిన లక్కీ డిప్ లో లతీఫ్ పేరు వచ్చింది. దీంతో ఆ సంస్థ మిలియన్ దిర్హామ్ లను (సుమారు రూ. 1.82 కోట్లు) అతనికి బహుమతిగా ఇచ్చింది. దీంతో లతీఫ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ డబ్బుతో ఏం చేయాలన్నది ఇంకా ఆలోచించుకోలేదని, తన కుటుంబాన్ని హ్యాపీగా ఉంచేందుకు ఉపయోగించుకుంటానని అంటున్నాడు.

  • Loading...

More Telugu News