: శ్రీశైలం పాతాళగంగలో విరిగిపడ్డ కొండచరియలు


శ్రీశైలంలోని పవిత్ర పాతాళగంగ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఉదయం నుంచి పలుమార్లు కొండలు విరిగి జలాశయంలో పడుతుండటంతో రోప్ వే సౌకర్యాన్ని అధికారులు నిలిపివేశారు. స్నానాలకు వెళుతున్న భక్తులను కేవలం పాతాళగంగ మెట్ల దారి మార్గం గుండా మాత్రమే అనుమతిస్తున్నారు. కొండను తొలిచి ఏర్పాటు చేసిన రహదారిని తాత్కాలికంగా నిలిపివేశామని దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఆమె సందర్శించారు. ప్రమాదం ఏమీ లేదని, భక్తులు ఆందోళన చెందవద్దని సూచించారు. పుష్కరాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో జాలీలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News