: కాబూల్ దాడులు మా పనే!: ఐఎస్ఐఎస్ ప్రకటన


ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ మారణహోమానికి తామే కారణమని ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ ప్రకటించింది. దేమజాంగ్‌ ప్రాంతంలో వందలాది షియా ముస్లింలు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ కోసం నిరసనలు తెలుపుతున్న సమయంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు దాదాపు 61 మంది మృతి చెందగా, 207 మంది క్షతగాత్రులయ్యారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రపంచ దేశాలు ఈ దారుణమారణ హోమాన్ని ఖండించాయి.

  • Loading...

More Telugu News