: హైదరాబాదు చేరుకున్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ


కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ సాయంకాలం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రతిష్ఠాత్మక సింబయోసిస్‌ హైదరాబాదు క్యాంపస్‌ ను ఆయన రేపు ప్రారంభించనున్నారు. మేనేజ్ మెంట్, న్యాయ విద్యనందించే సింబయోసిస్ విద్యాసంస్థకు సంబంధించిన విశాలమైన క్యాంపస్ ను మహబూబ్‌ నగర్‌ జిల్లా మామిడిపల్లి వద్ద ఏర్పాటు చేశారు. ఈ క్యాంపస్ ను ఆయన రేపు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొంటారు. జైట్లీకి బీజేపీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

  • Loading...

More Telugu News