: ముంపు గ్రామాల్లో రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్, హరీశ్‌లదే బాధ్యత: మర్రి శశిధర్‌రెడ్డి


మల్లన్నసాగర్ ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి తెలంగాణ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఆ ప్రాజెక్టు నిర్మాణంపై తాము గవర్నర్ నరసింహన్‌ను క‌ల‌వ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. గవర్నర్ మ‌ల్ల‌న్న సాగ‌ర్ అంశంపై స్పందించాల‌ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రిజిర్వాయర్ ఎందుకు నిర్మిస్తున్నారో వివ‌రంగా అడిగి తెలుసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. 'మల్లన్నసాగర్ అనవసరం' అని శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుపై కేసీఆర్‌ బహిరంగ చర్చకు సిద్ధ‌మా? అని ఆయ‌న స‌వాలు విసిరారు. రిజర్వాయర్ ముంపు గ్రామాల్లో రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్, హరీశ్ రావులు బాధ్యత వహించాలని శ‌శిధ‌ర్‌రెడ్డి అన్నారు. వివేకం లేకుండా ముఖ్య‌మంత్రి ప్రాజెక్టులకు రీ డిజైనింగ్ వేశార‌ని ఆయ‌న ఆరోపించారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణ‌యాలు తీసుకొని మల్లన్నసాగర్‌ను నిర్మించి దాని ద్వారా నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌లను నింపుతానంటోంద‌ని ఆయ‌న అన్నారు. నిపుణుల స‌ల‌హా కూడా తీసుకోక‌పోవ‌డం దారుణ‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News