: జంట పేలుళ్లతో ఉలిక్కిపడ్డ కాబూల్.. 50 మంది మృతి
ఉగ్రవాదుల దాడులు సామాన్యులను వణికిస్తున్నాయి. ప్రతిరోజు ప్రపంచంలోని ఎక్కడోచోట ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. అఫ్ఘనిస్థాన్ మరోసారి బాంబు పేలుళ్లతో ఉలిక్కిపడింది. కాబూల్‌లోని దహ్మజంగ్ ప్రాంతంలో ఈరోజు జంట పేలుళ్లు సంభవించాయి. రద్దీగా ఉన్న ప్రాంతాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. పేలుళ్లతో 50 మంది మృతి చెందారు, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. భద్రతా బలగాలు వెంటనే అక్కడకు చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.