: మోహన్ బాబుకు పితృవియోగం
ప్రముఖ నటుడు మోహన్ బాబుకు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి మంచు నారాయణస్వామి నాయుడు ఆదివారం అర్ధరాత్రి తిరుపతి సమీపంలోని మోహన్ బాబు విద్యాలయం 'శ్రీ విద్యానికేతన్' ప్రాంగణంలో తనువు చాలించారు. 95 సంవత్సరాల నారాయణస్వామి నాయుడు వయోభారంతో బాధపడుతున్నారు. తిరుపతి సమీపంలోని ఏర్పేడు మండలం మోదుగుల పాలెం గ్రామానికి చెందిన ఆయన ఉపాధ్యాయుడుగా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు మోహన్ బాబుకు తమ సంతాపాన్ని తెలియజేశారు.