: ఇదీ 'కబాలి' స్టామినా...బాహుబలిని దాటేసింది: తరణ్ ఆదర్శ్
ఎన్నో అంచనాలు, కనీవినీ ఎరుగని ప్రచారం మధ్య విడుదలైన 'కబాలి' సినిమా అద్భుత వసూళ్లతో దూసుకుపోతోంది. తొలి రోజు కలెక్షన్లతో ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డు నెలకొల్పిందని సినీ వాణిజ్య విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. 'కబాలి' (తెలుగు+తమిళం) యూఎస్ఏ-కెనడా ప్రివ్యూ షోల ద్వారా 12.93 కోట్ల రూపాయలు (1,925,379 డాలర్లు) వసూలు చేసిందని ఆయన తెలిపారు. గతంలో ఈ రికార్డును 'బాహుబలి' కలిగి ఉండగా, తాజాగా వచ్చిన 'సుల్తాన్' దాని తరువాతి స్థానంలో నిలిచింది. అయితే 'కబాలి' ఆ రెండు సినిమాలను దాటేసింది. అదే సమయంలో యూఎస్ లో అత్యధిక వీక్షకులు తిలకించిన ఇండియన్ సినిమా ప్రీమియర్ గా 'కబాలి' రికార్డులకెక్కింది. దీంతో యూఎస్ ప్రీమియర్ లో 'బాహుబలి' 1,382,076 డాలర్లు, 'సుల్తాన్' 786,194 డాలర్లు వసూలు చేయగా, 'కబాలి' 1,925,379 డాలర్లు వసూలు చేసింది. అంతే కాకుండా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 200 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.