: హైదరాబాద్‌లోని పార్కులను తీర్చిదిద్దుతాం: తెలంగాణ మంత్రి కేటీఆర్‌


హైద‌రాబాద్‌లోని పార్కులను అందంగా తీర్చిదిద్దుతామ‌ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈరోజు ఉదయం హైద‌రాబాద్‌ బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్క్‌ను ఆయ‌న స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, ఇతర అధికారులుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చెట్ల పెంప‌కంతోనే ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్యం సాధ్య‌మ‌ని, పార్కుల బాధ్య‌త‌లను అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు అప్ప‌గిస్తామ‌ని పేర్కొన్నారు. తెలంగాణలో చేప‌ట్టిన హ‌రిత‌హారంలో అంద‌రూ పాల్గొనాల‌ని, కార్య‌క్ర‌మంలో భాగంగా 20 రోజుల్లోనే 15 కోట్లకు పైగా మొక్కలు నాటామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News