: అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం తీవ్రతరం అవుతుంది: సీపీఎం ఏపీ కార్యదర్శి మధు


ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌జావ్య‌తిరేక విధానాలతో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని, ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ఆపేయాల‌ని సూచించారు. అగ్ర‌రాజ్యం అమెరికాకు తలొగ్గే ప్రభుత్వం కావలి సమీపంలో అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేయ‌డానికి సిద్ధ‌ప‌డుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. దీన్ని స్థానికులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నార‌ని, ప్ర‌జా పోరాటం ఉద్ధృతం అవుతుంద‌ని ఆయ‌న స‌ర్కారుని హెచ్చ‌రించారు.

  • Loading...

More Telugu News