: సోషల్ మీడియాలో మ్యూనిక్ ముష్కరుడి దాడి దృశ్యాలు!... వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియోలు!
జర్మనీ నగరం మ్యూనిక్ లోని షాపింగ్ మాల్ లో తుపాకీ చేతబట్టి విరుచుకుపడ్డ ఉగ్రవాది 15 మందిని పొట్టనబెట్టుకున్నాడు. పలువురిని గాయాలపాలు చేశాడు. ఊహించని ఈ పరిణామానికి జర్మన్లు భయభ్రాంతులకు గురయ్యారు. దాడి జరిగిన షాపింగ్ మాల్ లో ఉన్న వారు పరుగులు పెట్టి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో స్వల్ప నిడివి కలిగిన రెండు వీడియోలో ప్రత్యక్షమయ్యాయి. 35 సెకన్లు, 23 సెకన్ల నిడివి ఉన్న ఈ రెండు వీడియోల్లో ఉగ్రవాది ఒక్కడిగానే వచ్చినా నిర్భయంగా నిలబడి అమాయకులపై తుపాకీ గురిపెట్టి కాల్చిన వైనం వెన్నులో వణుకు పుట్టిస్తోంది.