: ఫ్లై ఓవర్ నుంచి కిందపడ్డ టిప్పర్.. తప్పిన ఘోర ప్రమాదం
హైదరాబాద్ పంజాగుట్ట ఫ్లైవర్ కింద ఈరోజు ఉదయం వాహనదారులు, పాదచారులకి ఘోర ప్రమాదం తప్పింది. ఫ్లై ఓవర్ పైనుంచి వెళుతోన్న టిప్పర్, బైక్లు ఢీ కొనడంతో టిప్పర్ అదుపుతప్పి ఒక్కసారిగా పైనుంచి కిందకు పడింది. ఫ్లై ఓవర్ కింద ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇటీవల చిన్నారి రమ్య కుటుంబం ఇక్కడే ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. టిప్పర్లో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ ఫ్లై ఓవర్ పైనుంచి పెద్ద శబ్దంతో కిందకు పడడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.