: ‘స్వర్ణ’ కల్తీ పాపం ఎవరిది?... కుట్ర కోణంలో సీఐడీ దర్యాప్తు!


ఏడుగురు దినసరి కూలీల మృతికి, సుమారు 25 మందిని అస్వస్థతకు గురి చేసిన స్వర్ణ బార్ కల్తీ మద్యం పాపం ఎవరిదనే కోణంలో ఏపీ సీఐడీ కొత్త దిశగా దర్యాప్తును ముమ్మరం చేసింది. స్వర్ణ బార్ లో బాధితులు తాగిన మద్యంలో సైనైడ్ కలిసి ఉందని ఫోరెన్సిక్ నిర్ధారించడంతో పోలీసులు దర్యాప్తు దిశను మార్చక తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుటుంబానికి చెందిన స్వర్ణ బార్ కు చెందిన మద్యంలో సైనైడ్ కలిపిన వ్యక్తులు బయటివారే అయి ఉంటారన్న దిశగా సీఐడీ అనుమానిస్తోంది. సొంత బార్ కు చెందిన మద్యంలో సైనైడ్ కలపాల్సిన అవసరం మల్లాది విష్ణు, ఆయన అనుచర వర్గానికి లేదన్న భావనకు సీఐడీ అధికారులు వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా శ్రీలంక, లిబియా దేశాల్లో మాత్రమే లభ్యమయ్యే సైనైడ్ గుళికలు విజయవాడకు వచ్చిన వైనంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెరసి మద్యంలో సైనైడ్ కలిసిందన్న ఫోరెన్సిక్ నిర్ధారణతో ఈ కేసు దర్యాప్తు రూటే మారిపోయింది.

  • Loading...

More Telugu News