: వర్జీనియా సెనేటర్ టిమ్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన హిల్లరీ


వర్జీనియా సెనేటర్ టిమ్ కైనే‌(58)ను తన రన్నింగ్ మేట్ (ఉపాధ్యక్షుడు)గా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిగా పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్ ప్రకటించారు. తన మద్దతుదారులకు పంపిన మెసేజ్‌లో హిల్లరీ ఈ విషయాన్ని పేర్కొన్నారు.‘‘ఈ విషయం మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా, ఉద్వేగంగా ఉంది. సెనేటర్ టిమ్ కైనేను నా రన్నింగ్ మేట్‌గా ఎన్నుకున్నా’’ అని అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ట్విట్టర్‌లో టిమ్‌ను కొనియాడారు. ఇతరుల కోసం టిమ్ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రశంసించారు. ప్రపంచంలో ఎటువంటి సమస్యను అయినా పరిష్కరించవచ్చని నమ్మే గొప్ప ఆశావాది టిమ్ అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News