: కేవీపీగారూ... ‘కబాలి’ మీరే!: కాంగ్రెస్ నేతపై ఎంపీల ప్రశంసలు!


ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పార్లమెంటులో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. పార్లమెంటు ముందుకు పెద్ద సంఖ్యలో ప్రైవేటు బిల్లులు వస్తున్నా... కేవీపీ ప్రవేశపెట్టిన ‘హోదా’ బిల్లుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కబాలి’ విడుదలైన రోజే కేవీపీ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరుగుతుందన్న ప్రచారం సాగింది. దాదాపు వారం రోజులుగా కేవీపీ బిల్లుపై దేశవ్యాప్తంగా అన్ని మీడియా సంస్థల్లో పెద్ద ఎత్తున వార్తా కథనాలు వచ్చాయి. నిన్న రాజ్యసభలో జరిగిన హైడ్రామా నేపథ్యంలో బిల్లుపై ఓటింగ్ మరోమారు వాయిదా పడిపోయింది. దీంతో ఒక్క బిల్లుతో పార్లమెంటులో 'సెంటరాఫ్ అట్రాక్షన్'గా నిలిచారంటూ కేవీపీపై సాటి ఎంపీలంతా ప్రశంసలు కురిపించారు. ఒక్క బిల్లుతో ఈ స్థాయిలో దుమారం లేపవచ్చని కేవీపీ నిరూపించారంటూ పలువురు ఎంపీలు వ్యాఖ్యానించారు. మరికొందరు ఎంపీలు మరో అడుగు ముందుకేసి ‘‘ఈ రోజుకు ‘కబాలి’ మీరే’’ అని కేవీపీతో సరదా వ్యాఖ్యలు కూడా చేశారు.

  • Loading...

More Telugu News