: గల్లంతైన విమానం సముద్రంలో కూలిందా?... కొనసాగుతున్న గాలింపు!


ఎయిర్ ఫోర్స్ కు చెందిన 29 మంది అధికారులతో నిన్న చెన్నై నుంచి బయలుదేరిన కాసేపట్లోనే అదృశ్యమైన ఏఎన్-32 విమానం ఆచూకీ ఇంకా లభించలేదు. చెన్నై నుంచి టేకాఫ్ తీసుకున్న వెంటనే ఏటీసీతో సంబంధాలు తెగిపోయిన సదరు విమానం పోర్ట్ బ్లెయిర్ కు సమీపంలో సముద్రంలో కూలిపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. విమానం అదృశ్యం కాగానే గాలింపు చర్యలు చేపట్టిన ప్రభుత్వం... 24 గంటలు గడిచినా సదరు విమానం జాడ తెలియకపోవడంతో సముద్రంలోనే కూలిపోయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సముద్ర ఉపరితలంపైనా ఓ కన్నేసిన సహాయక బృందాలు గాలింపును మరింత ముమ్మరం చేశాయి. ఇక సముద్రంలో విమాన శకలాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ మత్స్యకారులకు సహాయక సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News