: కోహ్లీ డబుల్ సెంచరీ...అశ్విన్ అర్ధ సెంచరీ


వెస్టిండీస్ లోని అంటిగ్వాలో 302/4 స్కోరుతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు జోరు కొనసాగించింది. తొలిరోజు ఇన్నింగ్స్ ముగిసేసరికి 143 పరుగులతో కోహ్లీ, 22 పరుగులతో అశ్విన్ క్రీజులో ఉన్న అశ్విన్... రెండో రోజు కూడా బ్యాటు పదును చూపించారు. అద్భుతమైన ఫుట్ వర్క్ తో వీరిద్దరూ సమయన్వయం చేసుకున్న తీరు అందర్నీ ఆకట్టుకుంది. 281 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ తన టెస్టు కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేయడం విశేషం. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ కు దీటుగా 157 బంతులు ఎదుర్కొన్న రవిచంద్రన్ అశ్విన్ 67 పరుగులు చేయడం విశేషం. దీంతో తొలి టెస్టులో టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసి పటిష్ఠ స్థితికి చేరుకుంది.

  • Loading...

More Telugu News