: ‘పోకెమాన్’ ఆడటమొస్తే... జాబ్ గ్యారంటీ: బంపర్ ఆఫర్ ఇచ్చిన వెబ్ సైట్
‘పోకెమాన్’ మొబైల్ గేమ్ ఆడటమొస్తే ఉద్యోగమిచ్చేస్తామంటూ బెంగళూరుకు చెందిన 'బాబాజాబ్స్' అనే వెబ్ సైట్ ప్రకటించింది. ఈ ఆట ఆడటంలో ప్రావీణ్యం సంపాదించిన వారికి ఉద్యోగాలిస్తామని చెబుతూ, అదే వారి అర్హతగా పేర్కొంది. పోకెమాన్ ను ఎలా పట్టుకోవాలనే విషయంలో పూర్తి అవగాహనతో పాటు శారీరక దృఢత్వం ఉన్నవారు తమ వెబ్ సైట్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని బాబా జాబ్స్ సీఈవో పేర్కొన్నారు. ‘పోకెమాన్’లో క్లిష్టమైన దశలు చేరుకోలేనివారు తమ వద్ద ఉన్న ఉద్యోగుల సాయంతో వాటిని దాటవచ్చని చెప్పారు.