: కోహినూరు వజ్రాన్ని తీసుకురావడం ఎలా?... కేంద్ర మంత్రుల చర్చ!
కోహినూరు వజ్రంపై కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, మహేశ్ శర్మ సమావేశం నిర్వహించారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో లండన్ టవర్ లో వున్న కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తీసుకువచ్చే విషయంపై చర్చించారు. గతంలో సుప్రీంకోర్టుకు సమాధానమిచ్చిన సందర్భంగా కోహినూర్ వజ్రాన్ని ఇంగ్లండ్ దోచుకుపోలేదని, పంజాబ్ పాలకులు ఈస్ట్ ఇండియా కంపెనీకి గిఫ్ట్ గా ఇచ్చారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీనిపై వివిధ వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పార్లమెంటులో చర్చించే అవకాశం ఉన్నందున హౌస్ కు సమాధానం చెప్పడంపై ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది.