: గల్లంతైన ఎయిర్ ఫోర్స్ విమానంలో 8 మంది విశాఖ వాసులు
గల్లంతైన ఎయిర్ ఫోర్స్ విమానం ఏఎన్ -32 లో విశాఖపట్టణానికి చెందిన 8 మంది ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ విమానంలో ఎన్ఏడీ లో ఛార్జ్ మెన్ సాంబమూర్తి, ఆర్మమెంట్ ఫిట్టర్స్ ప్రసాద్ బాబు, నాగేంద్రరావు, సేనాపతి, మహారాణా, చిన్నారావు, చిట్టిబాబు, మల్టీ టాస్కింగ్ సిబ్బంది శ్రీనివాసరావు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని వారి కుటుంబసభ్యులకు తెలియజేసినట్లు చెప్పారు. కాగా, మొత్తం 29 మంది సిబ్బందితో చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్ రాజధాని పోర్టు బ్లెయిర్ కు బయలుదేరిన ఈ విమానం ఈ ఉదయం గల్లంతైన విషయం విదితమే.