: ఆ మూడు పార్టీలు కుమ్మక్కయ్యాయి: వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయని... ఈ మూడు పార్టీలు కుమ్మక్కై ప్రత్యేక హోదాపై ప్రైవేట్ బిల్లును ఓటింగ్ కు రాకుండా చేశాయని ఆరోపించారు. ప్రైవేట్ బిల్లు పెట్టిన కాంగ్రెస్ పార్టీ సభ్యులే పోడియం వద్దకు వెళ్లి సభను అడ్డుకోవడం దురదృష్టకరమని, సమస్యను పొడిగించి లబ్ధి పొందాలని ఆ పార్టీ చూస్తోందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై తమ పార్టీ రెండేళ్లుగా పోరాడుతోందని, ఆ పోరాటం కొనసాగిస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.