: తమ ఇంటిని తక్కువ రేటుకి కాజేయాలని చూస్తున్నారంటూ... ఎంపీ గల్లా జయదేవ్ పై సీఎం చంద్రబాబుకు మహిళ ఫిర్యాదు!


తమ భవనాన్ని తక్కువ రేటుకు కాజేయాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ యత్నిస్తున్నారంటూ ఒక మహిళ ఆరోపించింది. గుంటుపల్లి పద్మజ అనే మహిళ ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేసింది. రూ.8 కోట్లు విలువ చేసే తమ భవనాన్ని రూ.3.9 కోట్లకే దక్కించుకోవాలని జయదేవ్ యత్నిస్తున్నారంటూ బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు.. గుంటుపల్లి శ్రీనివాసరావు, పద్మజ భార్యాభర్తలు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లోని 300 గజాల్లో వారికి మూడు అంతస్తుల భవనం ఉంది. వారి ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడంతో 2013 లో ఆ ఇంటి పత్రాలను ఆంధ్రాబ్యాంకులో పెట్టి రూ.2.30 కోట్ల రుణం తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో ప్రతి నెల చెల్లించాల్సిన ఈఎంఐ కూడా బ్యాంక్ కు కట్టలేకపోయారు. ఇదిలా వుండగా, ఈ భవనాన్ని 2014 ఎన్నికల సమయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అద్దెకు తీసుకున్నారు. ఇంటి యజమాని ఈఎంఐలు చెల్లించలేకపోవడంతో, బ్యాంకు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ భవనం వేలానికి వచ్చేలా జయదేవ్ చేశారని పద్మజ ఆరోపిస్తోంది. ఆయన బ్యాంకు డీజీఎంతో కుమ్మక్కయ్యారని ఆరోపించింది. ప్రస్తుతం రూ.7.5 కోట్ల మార్కెట్ విలువ ఉన్న తమ భవనానికి ప్రారంభ ధర రూ.2.80 కోట్లుగా నిర్ణయించిన బ్యాంకు ఇటీవల వేలం ప్రకటన జారీ చేసిందన్నారు.

  • Loading...

More Telugu News