: కబాలితో కోహ్లీ 'ఢీ'...సోషల్ మీడియాలో వ్యాఖ్యలు


'కబాలి' ఫీవర్ పీక్స్ కు చేరుకున్న దశలో నెటిజన్లు ప్రతి విషయాన్ని 'కబాలి'తో పోలుస్తున్నారు. 'తలైవా' అభిమానులైన క్రికెట్ ప్రియులు సోషల్ మీడియాలో తమ ప్రతిభాపాటవాలతో ఆకట్టుకుంటున్నారు. 'కబాలి'తో రజనీ సరికొత్తగా దర్శనమివ్వనున్న వేళ...వెస్టిండీస్ లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో కదంతొక్కడాన్ని పోలుస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో 'కబాలి'తో కోహ్లీ 'ఢీ' అని పేర్కొంటున్నారు. 'కబాలి' ధియేటర్లలోకి వచ్చేసినా, కోహ్లీ మాత్రం క్రీజును వదల్లేదని పేర్కొంటున్నారు. ధియేటర్లను 'కబాలి' హిట్ చేస్తే... కోహ్లీ విండీస్ బౌలర్లను హిట్ చేస్తున్నాడని వ్యాఖ్యానాలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. 'కోహ్లీ కోసం తెల్లవార్లూ టెస్టు చూశాం...రజనీ కోసం ధియేటర్ కు వెళ్తున్నాం' అని మరి కొందరు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News