: ‘పోకెమాన్’ జపాన్ కు కూడా వచ్చేసింది


అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, మరో 30 ఐరోపా దేశాల్లో ఇప్పటికే ఉన్న ‘పోకెమాన్’ మొబైల్ గేమ్ ను తాజాగా జపాన్ దేశంలో అధికారికంగా ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా గేమ్ డెవలప్ మెంట్ హెడ్ జునిచి మసుదా మాట్లాడుతూ, జపాన్ లో ‘పోకెమాన్’ను విడుదల చేయడం ఆలస్యమైందని, అందుకు క్షమాపణలు చెబుతున్నామని అన్నారు. కాగా, పోకెమాన్ మాయలో పడి చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో జపాన్ ప్రజలకు ఆ దేశ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ సెక్యూరిటీ నేపథ్యంలో కొన్ని సూచనలు చేసింది. యువతను విపరీతంగా ఆకట్టుకున్న ‘పోకెమాన్’ మన దేశంలో ఇంకా విడుదల కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News