: మొక్కుబడిగా ఒక మొక్క నాటిన సానియామీర్జా


హరితహారంలో భాగంగా ప్రముఖ టెన్నిస్ ప్లేయర్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా తన నివాసంలో మెుక్కుబడిగా ఒక మొక్క నాటింది. ఇందుకు సంబంధించిన ఒక ఫొటోను సానియా మీర్జా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో సానియాతో పాటు ఆమె కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమానికి మద్దతుగా పలువురు సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు తమ వంతు పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కానీ, తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్ అయిన సానియా మీర్జా మాత్రం హరితహారం కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఏదో మొక్కుబడిగా ఒక మొక్క తన ఇంట్లో నాటి చేతులు దులుపుకుందంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News