: ఇంటివాడు కాబోతున్న 'స్నాప్‌చాట్' సీఈవో.. సూపర్‌మోడల్ మిరాండాతో వివాహం
ఆస్ట్రేలియాకి చెందిన సూపర్‌మోడల్ 'మిరాండా కెర్'ని మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ సీఈవో ఇవాన్ స్పీగెల్ వివాహం చేసుకోనున్నారు. వారి వివాహానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మోడల్ మిరాండా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలిపింది. ఈ సందర్భంగా ఆమె నిశ్చితార్ధం ఉంగరం ఫొటోపై స్నాప్‌చాట్ స్టికర్స్ ఉన్న ఓ పిక్ ని పోస్ట్ చేసింది. సూపర్‌మోడల్ మిరాండా కెర్ ఇంతకు ముందు హాలీవుడ్ నటుడు ఓర్లాండో బ్లూమ్ని వివాహమాడి, ఆ తరువాత ఆయనతో వచ్చిన విభేదాల కారణంగా విడిపోయింది. మిరాండా, బ్లూమ్ లకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు.