: ఆదర్శ్ సొసైటీ భవనాన్ని స్వాధీనం చేసుకోండి!: కేంద్రానికి సుప్రీం ఆదేశం


మహారాష్ట్రలో పెను రాజకీయ కలకలానికి కేంద్ర బిందువుగా మారిన ‘ఆదర్శ్ సొసైటీ’కి చెందిన బహుళ అంతస్తుల భవంతిని స్వాధీనం చేసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా అన్ని పార్టీల నేతలకు ప్రమేయం ఉందన్న కుంభకోణానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. కాగా, ఈ భవనాన్ని కూల్చివేయాలన్న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాలను బాంబే హైకోర్టు సమర్ధించింది. అయితే దీనిపై దృష్ఠి సారించిన సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం సంచలన తీర్పు వెలువరించింది. 31 అంతస్తుల భవంతిని కూల్చేయకుండా దానిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల (ఆగస్టు)లోగా స్వాధీన ప్రక్రియ పూర్తి కావాలని కూడా కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News