: చిట్టీల పేరిట బెజవాడ వాసుల పుట్టి ముంచిన నాగరత్నం!... రూ.2 కోట్లతో ఉడాయించిన వైనం!
చిట్టీల పేరిట రంగంలోకి దిగి చేతివాటం ప్రదర్శించిన ఓ మాయలేడి బెజవాడ జనాన్ని నట్టేట ముంచింది. మాయలేడి మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన నగర జనం లబోదిబోమంటున్నారు. వివరాల్లోకెళితే... బెజవాడకు చెందిన నాగరత్నం అనే మహిళ తొలుత స్వల్ప మొత్తంతో కూడిన చిట్టీలను నిర్వహించింది. కాలక్రమేణా తనపై జనాల్లో నమ్మకాన్ని పెంచుకున్న ఆమె చిట్టీల పరిమాణాన్ని, సంఖ్యనూ పెంచేసింది. అనుకున్న సమయానికే నిక్కచ్చిగా డబ్బులు ముట్టజెబుతున్న నాగరత్నాన్ని తెగ నమ్మేసిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆమె నిర్వహిస్తున్న చిట్టీల్లో సభ్యులుగా చేరారు. ఈ క్రమంలో ముందుగానే నిర్ణయించుకున్న మేరకు తాను అనుకున్నంత సొమ్ము రూ.2 కోట్లు చేతికి చిక్కగానే నాగరత్నంలోని మాయలేడి నిద్ర లేచింది. జనానికి చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసింది. విషయం తెలుసుకున్న జనం లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.