: నాగాపూర్ రిజ‌ర్వాయ‌ర్ భూనిర్వాసితులతో సమావేశమైన కోదండరాం


తెలంగాణలో చేప‌ట్టిన ప్రాజెక్టులపై స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేయ‌డానికి టీజేఏసీ ఛైర్మ‌న్ ప్రొ.కోదండ‌రాం ఆధ్వ‌ర్యంలో నిన్న ప్రారంభమయిన అధ్య‌య‌న‌ యాత్ర కొనసాగుతోంది. నిన్న హైద‌రాబాద్‌లోని అసెంబ్లీ సమీపంలో ఉన్న గ‌న్‌పార్క్ నుంచి ‘అధ్య‌య‌న యాత్ర’ను ప్రారంభించిన కోదండరాం నేడు మహబూబ్‌న‌గ‌ర్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. పాల‌మూరు ప్రాజెక్టుల అంశంలో అధ్య‌య‌నం చేస్తున్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని కొల్లాపూర్ మండ‌లం నాగాపూర్ రిజ‌ర్వాయ‌ర్ భూనిర్వాసితుల‌తో ప్రొ.కోదండ‌రాం, ప్రొ.హ‌ర‌గోపాల్ స‌మావేశ‌మ‌య్యారు. వారి క‌ష్టాల‌ను, ప్ర‌భుత్వం నుంచి వారికి అందుతోన్న ప‌రిహారంపై ఆయ‌న చ‌ర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News