: ఒక తప్పుకు ఇన్ని వేధింపులా..: దయాశంకర్ భార్య ఆవేదన


మాయవతి మద్దతుదారులు తనను, తన కుమార్తెను వేధిస్తున్నారని మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ బీజేపీ నేత దయాశంకర్ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్పీ నుంచి తమకు వేధింపులు ఎక్కువయ్యాయని దయాశంకర్ భార్య స్వాతి సింగ్ ఆరోపించారు. ‘‘వారు నన్ను, నా 12 ఏళ్ల కుమార్తెను ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. దుర్భాషలాడుతున్నారు. నా కూతుర్ని అన్యాయంగా ఇందులోకి లాగుతున్నారు. మాకు మద్దతుగా ఎవరూ ముందుకు రావడం లేదు. మైనర్ అయిన కుమార్తె తీవ్ర మనస్తాపంలో కూరుకుపోయింది’’ అని స్వాతి పేర్కొన్నారు. ‘‘ఓ వ్యక్తి తెలియక ఒక తప్పు చేస్తే దానికి ఇన్ని రకాల వేధింపులా?’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమకేమైనా జరిగితే మాయావతి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు అయిన దయాశంకర్.. మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. బీఎస్పీ నేతలు ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టారు. దీంతో స్పందించిన బీజేపీ అధిష్ఠానం అతడిని పార్టీ నుంచి ఆరు సంవత్సరాలు బహిష్కరించింది. పలు పోలీస్ స్టేషన్లలో దయాశంకర్‌పై కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News