: ట్రంప్ నోట మళ్లీ అదే మాట.. మెక్సికో సరిహద్దు వెంబడి గోడ కట్టి తీరుతామన్న అధ్యక్ష అభ్యర్థి


వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే అమెరికా అధ్యక్ష అభ్యర్థి, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మరో మారు అటువంటి వ్యాఖ్యలే చేశారు. మెక్సికో నుంచి అక్రమ వలసలు ఆపేందుకు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు మెక్సికో బోర్డర్ వెంబడి గోడ కడతామని గతంలో ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆ వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. గోడ కట్టి తీరుతామని స్పష్టం చేశారు. ‘‘అక్రమ వలసలు అరికట్టడంతోపాటు క్రిమినల్ గ్యాంగులు దేశంలోకి చొరబడకుండా అమెరికా, మెక్సికో సరిహద్దులో గోడకట్టి తీరుతాం’’ అని గురువారం ట్రంప్ వ్యాఖ్యానించారు. గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన మెక్సికో గోడ కడితే కట్టుకోవాలని దీటుగా బదులిచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News