: పట్టిసీమ పూర్తి... ఇక పోలవరం!... వారంలో ఓ గంట ప్రాజెక్టు వద్దేనంటున్న చంద్రబాబు!
ఏపీలో సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్నాయి. గడచిన ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సాగు నీటి ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారించారు. అతి తక్కువ సమయంలోనే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసిన చంద్రబాబు సర్కారు దేశంలోనే నదులను అనుసంధానం చేసిన తొలి ప్రభుత్వంగా రికార్డులకెక్కింది. కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేసిన చంద్రబాబు... ఇక జాతీయ ప్రాజెక్టు పోలవరంపై దృష్టి సారించారు. నిన్న విజయవాడలో జరిగిన సమీక్షల్లో భాగంగా చంద్రబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వారంలో ఓ గంట పోలవరం ప్రాజెక్టు వద్దే తిష్ట వేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ప్రతి రోజు ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి సారిస్తానని కూడా ఆయన ప్రకటించారు. ఏదేమైనా 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరాల్సిందేనని ఆయన అధికార యంత్రాంగానికి డెడ్ లైన్ విధించారు.