: ఎనిమిదో భార్యను మోసగించి డబ్బు, బంగారంతో పలాయనం.. లబోదిబోమంటున్న బాధితురాలు


ఇప్పటికే ఏడుగురిని పెళ్లి చేసుకుని వారిని మోసగించిన ఓ ప్రబుద్ధుడు ఇటీవల ఎనిమిదో వివాహం చేసుకుని ఆమెను కూడా మోసగించి డబ్బు, బంగారంతో పలాయనం చిత్తగించాడు. భర్త మోసాన్ని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. మధురైకి చెందిన భాను(28), తన రెండో భర్త బాషా రూ.3.5 లక్షలు, బంగారు ఆభరణాలు తీసుకుని పారిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. గతంలో చెన్నై, దిండిగల్ తదితర ప్రాంతాలకు చెందిన ఏడుగురిని ఆయన పెళ్లి చేసుకుని వారిని కూడా మోసం చేశాడని పోలీసులకు తెలిపింది. 2011లో తొలి వివాహం చేసుకున్న భాను ఏడాది తర్వాత భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఇటీవల ఆమెకు తస్లీమా అనే మహిళ ద్వారా బాషా పరిచయమయ్యాడు. మే 26న ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. ఈనెల 2న తాను పనిమీద వేరే ఊరు వెళ్తున్నానని చెప్పిన బాషా తనతోపాటు రూ.3.5 లక్షల నగదు, బంగారు ఆభరణాలు తీసుకెళ్లాడు. అవి కనిపించకుండా పోవడం, భర్త తిరిగి ఇంటికి రాకపోవడంతో అనుమానించి భాను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతంలో ఆయన చేసిన మోసాలు వెలుగులోకి వచ్చాయి.

  • Loading...

More Telugu News