: ప్రో కబడ్డీ లీగ్ లో జాతీయగీతం ఆలపించిన సన్నీ లియోన్
హైదరాబాద్ లో జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ లో భాగంగా దబాంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య ఈరోజు రాత్రి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు వేదికపై బాలీవుడ్ నటి సన్నీలియోన్ జాతీయగీతం ఆలపించింది. కాగా, ప్రో కబడ్డీ లీగ్ సీజన్ ఆరంభం నుంచి పలు రంగాలకు చెందిన ప్రముఖులు జాతీయగీతం ఆలపిస్తుండటం ఆనవాయతీగా వస్తోంది. ఇందులో భాగంగానే సన్నీ లియోన్ వేదికపై జాతీయగీతం ఆలపించింది. జైపూర్ పింక్ పాంథర్స్ యజమాని, బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, సోనూ సూద్ ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించారు.