: ‘కబాలి’ దర్శకుడిని అభినందించిన రజనీకాంత్


‘కబాలి’ చిత్ర దర్శకుడు పా. రంజిత్ ను తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభినందించారు. అమెరికాలోని ఓ ప్రివ్యూ థియేటర్ లో తాను నటించిన ఈ సినిమాను చూసిన రజనీ.. వాట్సాప్ ద్వారా రంజిత్ ను అభినందించారు. ఈ విషయాన్ని రంజిత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాల్లో కంటే ఈ చిత్రంలో తానెంతో విభిన్నంగా కనిపిస్తున్నానని రజనీ వాట్సాప్ మెసేజ్ లో పేర్కొన్నారని, ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించావంటూ తనకు రజనీ కృతఙ్ఞతలు తెలిపారని రంజిత్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News