: హైదరాబాద్ నగర రోడ్ల దుస్థితిపై జీహెచ్ఎంసీ అధికారులపై మండిపడ్డ కేటీఆర్


హైదరాబాద్ నగరంలో రోడ్ల దుస్థితిపై మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో రోడ్ల స్థితిగతులపై ఆయన చర్చించారు. రోడ్ల దుస్థితిపై ఎన్నిసార్లు హెచ్చరించినా అధికారుల తీరులో మార్పు రావడం లేదని, రోడ్ల పరిస్థితులపై అన్ని విభాగాధిపతులు వెంటనే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. రహదారుల పరిస్థితుల్లో మార్పు రాకపోతే చర్యలు తప్పవని, ఎంతటివారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News