: ‘భూమా’ కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి!


ఏపీ మంత్రి వర్గ విస్తరణలో భూమా నాగిరెడ్డి కుటుంబంలో ఒకరికి చోటు దక్కే అవకాశముందని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. కర్నూల్ జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిల ప్రియ వైఎస్సార్సీపీ నుంచి ఇటీవలే టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో ఎస్టీ, ముస్లిం, క్షత్రియ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు లేరు. ఈ నేపథ్యంలో కేబినెట్ లో బెర్తు కోసం ముస్లింల నుంచి షరీఫ్, కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అవకాశం కోసం చూస్తున్నట్లు సమాచారం. క్షత్రియుల నుంచి పిఠాపురం ఎమ్మెల్యే వర్మ, ఉండి ఎమ్మెల్యే శివరామరాజు, ఎస్టీ వర్గం నుంచి పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్, ఎమ్మెల్సీ సంధ్యారాణి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రాయలసీమకు చెందిన బీసీ నేతలు అయిన పెనుగొండ ఎమ్మెల్యే బీకే పార్ధసారథి మంత్రి పదవి కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News